నిధులు

HDBuzz కి HD కమ్యూనిటీ సంస్థల కన్సార్టియం (కూటమి) ద్వారా నిధులు సమకూరుతాయి. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హంటింగ్టన్'స్ డిసీజ్ అసోసియేషన్, హంటింగ్టన్ సొసైటీ ఆఫ్ కెనడా మరియు హంటింగ్టన్'స్ డిసీజ్ సొసైటీ ఆఫ్ అమెరికా మా వ్యవస్థాపక భాగస్వాములు. గ్రిఫ్ఫిన్ ఫౌండేషన్ అనే లాభాపేక్షలేని విద్యా సంస్థ మా ప్రధాన నిధుల భాగస్వామి.

ఈ సంస్థలు HDBuzz కి మద్దత్తు ఇవ్వడాన్ని, మొత్తం HD జనులందరికీ కి సేవ గా భావించి చేస్తున్నాయి. వారికి కంటెంట్ పై ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేవు. అందరి కి ఉచితంగా లభ్యమయ్యే దే వారికీ లభిస్తుంది. వారికి కంటెంట్పై సంపాదకీయ నియంత్రణ కూడా లేదు ఉండబోదు

యూరోపియన్ హంటింగ్టన్ డిసీజ్ నెట్వర్క్ అనే ఒక స్వతంత్ర శాస్త్రవేత్తల మరియు HD నిపుణులు నెట్వర్క్ - HDBuzz కి ముఖ్యమైన కార్య నిర్వహణ సహాయం చేస్తుంది మరియు సలహాదారుగా పని చేస్తుంది. HDBUzz కంటెంట్ విస్తృతమైన ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని ఉచితంగా కొంత అనువాద మద్దతును కూడా అందిస్తుంది

HDBuzz నిధులు సేకరణ కొనసాగిస్తుంది. మా సంకల్పానికి మద్దతు ఇచ్చే ఇతర హ్డ్ కమ్యూనిటీ సమూహాలు, దాతృత్వ సంస్థలు మరియు ఇతర సంస్థలు మరియు వ్యక్తుల నుండి విరాళాలను స్వీకరించడానికి మా ప్రయత్నాలను కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము. భవిష్యత్తులో, మేము ఆన్లైన్లో వ్యక్తిగత విరాళాలను స్వీకరించడానికి మా సైట్లో విరాళం బటన్ను కల్పించవచ్చు. కానీ హ్డ్భుజ్జ్ కంటెంట్ను చదవడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ ఉండబోదు.

HDBuzz ఏదేని స్వార్థ ప్రయోజనాలకోసం నిర్దిష్ట చికిత్స ని ప్రోత్సహించే ఫార్మా కంపెనీల నుండి నిధులు తీసుకోదు. మందుల కంపెనీలంటే మాకు ఇష్టమే ఎందుకంటే వారు HD ని నయం చేయడంలో మనతో కలిసి పని చేస్తున్నారు. కాని ఎదో ఒక చికిత్సని ప్రోత్సహించే వారి వద్ద నుండి నిధులు తీసుకోవడం వల్ల పక్షపాత ధోరణి రావొచ్చు, అలా కాకుండా చుస్కోవడం మా లక్ష్యం

HDBuzz ఆర్థిక భాగస్వాములు