సైట్ ప్రశ్నలు

ఏమిటి ఈ HDBuzz ?

HDBuzz అనేది HD వ్యాధి పట్ల నాణ్యమైన సమాచారాన్ని ప్రపంచం లో అందరికీ అర్థమయ్యే సాదా భాష ల్లో అతి వేగంగా అందించడానికి వైద్యులు మరియు శాస్త్రగ్నులచే నడిపింపబడుతున్న తొలి ఇంటెర్నెట్ పొర్టల్. ఇందులో క్లినికల్ పరిశోధనలు మరియు ప్రయోగ శాలల్లో నిర్వహింపబడుతున్న పరిశోధనల గురించి తాజా సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే భాషలో వ్రాయబడుతుంది

కంటెంట్ మొత్తం hdbuzz.net నుండి ఇతర హ్డ్ కమ్యూనిటీ వెబ్సైట్లు, బ్లాగ్లు మరియు ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు ఉచితంగా సిండికేషన్ ద్వారా ప్రచారం చేయబడుతుంది.

మీరెవరు?

HDBuzz ను UK కి చెందిన డాక్టర్ ఎడ్ వైల్డ్ (Dr Ed Wild) మరియు USA కి చెందిన డాక్టర్ జెఫ్ కారోల్ (Dr Jeff Carroll) , అనే HD శాస్త్రవేత్తలు స్థాపించారు. సహాయానికి మేము అనేక మందిని నియమించాము - ప్రజలు పేజీ ను చూడండి. పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఇప్పటికే HD కమ్యూనిటీలో వివిధ సామర్థ్యాలలో చురుకుగా ఉన్నారు.

HDBuzz నిష్పాక్షికమైనదా?

అవును, మా రిపోర్టింగ్లో నిష్పక్షపాతంగా ఉండటానికి మేము చాలా ప్రయత్నిస్తాము

  • మేము ఏదైనా ఒక చికిత్స లేదా టెక్నాలజీలో స్వార్థ ఆసక్తి ఉన్న మందుల కంపెని లేదా ఇతర సంస్థల నుండి నిధులు అంగీకరించడం లేదు
  • HDBuzz కంటెంట్ పై సంపాదకీయ నియంత్రణ నిధులు సమకూరుస్తున్న ఏ సంస్థ కీ ఉండదు.
  • స్వతంత్ర వైద్యులు, శాస్త్రవేత్తలు మరియు సమాజ సభ్యులు కలిగిన ఒక పర్యవేక్షణ కమిటీ మా కంటెంట్ నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా ఖచ్చితమైనదై మరియు అర్థమయ్యేలా ఉండేలా చూస్తుంది.
  • మా రచయితలు అందరూ ఆర్ధిక పరమైన ఆసక్తి లేదనే ప్రకటనను కొత్త కంటెంట్ను అందించిన ప్రతి సారి వెల్లడిస్తారు.
హంటింగ్టన్'స్ వ్యాధికి సబంధించిన సమాచారం ఎక్కడ పొందవచ్చు?

చాలా దేశాలలో వారి వారి సొంత హ్డ్ అసోసియేషన్లు ఉన్నాయి. హ్డ్ గురించి కనుగొనడం ప్రారంభించడానికి ఇవి అద్భుతమైన ప్రదేశాలు. అనేక వ్యక్తులకు వీరు ప్రత్యక్ష మద్దతు అందిస్తారు. ఎప్పటికప్పుడు మేము హ్డ్ లో తరచుగా అడిగే ప్రశ్నలను తరచుగా అడుగు ప్రశ్నలు కథనాలుగా వ్రాస్తాము . మీకు వ్యక్తిగత వైద్య సలహా అవసరమైతే, డాక్టర్ని చూడండి.

HDBuzz ను నేను వేరే భాషలో ఎలా చదవగలను?

మీరు ఏదైనా పేజీ యొక్క ఎగువ ఎడమ చేతి మూలలో గ్లోబ్ చిహ్నాన్ని క్లిక్ చేయడం ద్వారా భాషను మార్చవచ్చు. HDBuzz ఇంగ్లీష్ లో వ్రాయబడింది, అందువల్ల ఇంకా అనువదించబడని ఆంగ్ల భాషా కథనాలు అందుబాటులో ఉండవచ్చు. మేము మద్దత్తు ఇచ్చే భాషలన్నింటి లోకి అనువదించడానికి మరియు క్రొత్త భాషలను చేర్చడానికి కృషి చేస్తున్నాము. మీ భాషలో HDBuzz అందుబాటులో ఉండాలని మీరు కోరుకుంటే, మీరు మీ భాషలో HDBuzz చదవాలనుకుంటున్నారని వారికి తెలియజేయడానికి మీ దేశం యొక్క HD అసోసియేషన్ (సంఘం) ను సంప్రదించండి.

మీ అనువాదాలు ఎవరు చేస్తారు?

HDBuzz,ప్రపంచవ్యాప్తంగా ఉన్న HDఅసోసియేషన్స్, యూరోపియన్ హంటింగ్టన్'స్ డిసీజ్ నెట్వర్క్ మరియు ద్విభాషా HD శాస్త్రవేత్తల నెట్వర్క్ ద్వారా స్వచ్చందంగా అనువదించబడుతుంది. మేము వారి ప్రయత్నాలకు చాలా కృతజ్ఞులము.

నేను అనువాదకునిగా స్వచ్ఛంద సేవ చేయ వచ్చా?

మీకు రెండు భాషల పై పట్టు ఉండి, HD క్లినికల్ కేర్ లేదా శాస్త్రీయ పరిశోధనలో వృత్తిపరమైన ప్రమేయం ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి సంప్రదించండి.

HDBuzz కు నిధులను ఎవరు ఇస్తారు?

దయచేసి మా నిధుల పేజీ ను చూడండి.

మీకు మీ ఆర్టికల్స్(కథనాలు) ఎక్కడ లభిస్తాయి?

HDBuzz కంటెంట్ ఎక్కువగా పీర్-రివ్యూ చేసిన శాస్త్రీయ కథనాలు మరియు పోస్టర్లు లేదా మౌఖికంగా సమావేశాలలో సమర్పించబడిన పనిపై ఆధారపడి ఉంటుంది. అప్పుడప్పుడు ప్రముఖ పరిశోధకులతో ఇంటర్వ్యూలు ఉంటాయి మరియు ఎప్పటికప్పుడు హ్డ్ సంఘంలో ప్రత్యేక ఆసక్తి కర్ మైన శాస్త్రీయ అంశాలపై ప్రత్యేక కథనాలను వ్రాస్తాము. వార్తల పేజీలో ఉన్న ఫారమ్ని ఉపయోగించి కథనాలకి అంశాలని సూచించటానికి సంకోచించకండి.

మీరు నా కంపెనీ ప్రెస్ రిలీజ్ ను ప్రచురిస్తారా?

మేము నేరుగా ప్రెస్ రిలీజ్ చేయడం అరుదు ముఖ్యంగా ఇంకా ప్రచురించబడని పరిశోధన గురించి చేయము. అయితే అలాంటి అంశాల గురించి మీరు సమాచారం అందిస్తే సంతోషిస్తాం.

నేను మిమ్మల్ని వైద్య సలహా అడగవచ్చా?

లేదు, HDBuzz మరియు దాని సహాయకులు వ్యక్తిగత వైద్య సలహా ఇవ్వలేరు. మేము మా కంటెంట్ను ఉచితంగా HD సంఘానికి అందిస్తున్నాము కానీ వ్యక్తిగత వైద్య నిర్ణయాలు మీ వైద్యునితో చర్చంచికోవాలి. దయచేసి మా ఉపయోగ నిబంధనలను చూడండి.

మిమ్మల్ని శాస్త్రీయ సలహా అడగవచ్చా?

చాలా ఎక్కువగా ఈమెయిల్స్ రావడం కారణంగా వ్యక్తిగత శాస్త్రీయ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేము. దేని గురించైనా ఒక కథనాన్ని వ్రాయాలని మీరు కోరుకుంటే, దయచేసి న్యూస్ పేజిలో ఉన్న బాక్స్ ని వాడండి.

మీరు నియామకాలు చేస్తున్నారా?

ప్రస్తుతం మేము ప్రత్యేక పోస్టుల నియామకము చేయకపోయినా, గ్లోబల్ (ప్రపంచ) HD కమ్యూనిటీకి హంటింగ్టన్'స్ వ్యాధి రీసెర్చ్/పరిశోధన ని తెలియ చేయాలన్న ఆసక్తితో ఉత్సాహభరితంగా ఉన్న వ్యక్తులచే మేము ఎల్లప్పుడూ సంప్రదింపబడాలని కోరుకుంటాము.

నేను HDBuzz కు విరాళం ఇవ్వవచ్చా?

ప్రస్తుతం మేము వ్యక్తిగత విరాళాల కోసం అడగడం లేదు, అయితే మేము భవిష్యత్తులో అలా చేయవచ్చు. దయచేసి నిధులను HDBuzz కి ఆర్థిక సహాయం చేసే సంస్థల్లో ఒకదానికి విరాళం ఇచ్చి మీ మద్దత్తుని తెలియజేయనివ్వండి.

నేను వ్యాసంతో విభేదిస్తున్నాను. మీరు దాన్ని మార్చగలరా?

ఎల్లప్పుడూ మేము మా కంటెంట్ ఖచ్చితమైనదేనని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మేము అవాస్తవ ప్రకటన చేస్తే, దయచేసి మాకు తెలియజేయండి, మేము సరిచేస్తాము. నిష్పక్షపాతంగా ఉండటానికి మేము చాలా కష్టపడుతున్నా, విజ్ఞాన శాస్త్రం లో అనివార్యంగా తప్పులు జరుగుతాయి, కాబట్టి దయచేసి మా కంటెంట్తో విభేదిస్తే, బాధ లేదా నిరుత్సాహ పడకండి. ఈమెయిల్స్ చాలా ఎక్కువగా రవడం వల్ల, వ్యక్తిగతంగా మీకు బదులు ఇవ్వ లేకపోవచ్చు.

సైన్స్ ప్రశ్నలు

నేను HD గురించి శాస్త్రీయ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ పొందగలను?

మేము HD పరిశోధన కి సంబంధించి సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి "తరచుగా అడుగు ప్రశ్నలు" కథనాలను ఉత్పత్తి చేస్తున్నాము.